స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా పం చాయతీలకా.. పరిషత్లకా..? అన్న ఉత్కం ఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ముందుగా వేటికి నిర్వహిస్తామన్నది మాత్రం చెప్పడం లేదు. దీంతో జిల్లాలోని ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. కాగా జిల్లాలో 531 గ్రామ పంచాయతీలు, 257 ఎంపీటీసీలు, 21 జడ్పీటీసీలున్నాయి. అధికారులు జిల్లావ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని జిల్లాలోని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ముందుగా పంచాయతీలకా.. లేక పరిషత్లకా..? తెలియక వారు అయోమయానికి లోనవుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ముందుగా వేటిని నిర్వహిస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల వాతావరణ మొదలైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడడం లేదు. జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ప్రకటించాలని బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. జనాభా లెక్క ల్లో బీసీల సంఖ్య తగ్గిందని తిరిగి మళ్లీ రీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రిజర్వేషన్లు గతంలో మాదిరిగానే కొనసాగుతాయా..? లేక మారుతాయా ..? అన్న దానిపైనా స్పష్టత లేదు. జనా భా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ప్రకటిస్తే మార్పులు, చేర్పు లు జరిగే అవకాశాలుంటాయి. జిల్లాలోని సగ భాగానికిపైగా మున్సిపాలిటీ ల్లో కలిసిపోయినా మిగతా ప్రాంతాల్లోనూ పోటీ తీవ్రం గా ఉన్నప్పటికీ అందరూ రిజర్వేషన్లపైనే గురి పెట్టారు.
సన్నద్ధమవుతున్న పార్టీలు..
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ను అనుకూలంగా మార్చుకుని స్థానిక సం స్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండల స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి లోకల్ ఎన్నికల్లో సత్తాచాటాలని సూ చించారు. అలాగే, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నది. చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి నియోజకవర్గాలూ ఆ పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. అలాగే, బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నది.
జిల్లాలో 531 పంచాయతీలు.. 257 ఎంపీటీసీలు..
జిల్లాలో మొత్తం ఓటర్లు 7,63,665 మంది ఉన్నా రు. జిల్లాలో 531 గ్రామపంచాయతీలు, 4,710 వార్డులు, 252 ఎంపీటీసీలున్నాయి. అలాగే, జిల్లాలోని ఆరు మండలాల్లోని 25 ఎంపీటీసీలు ఇటీవల మున్సిపాలిటీల్లో విలీనమయ్యా యి. మొయినాబాద్‌లో 8, శంకర్‌పల్లిలో 2, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 3, శంషాబాద్‌లో 3, కొత్తూరులో 4, చేవెళ్లలో 3 ఎంపీటీసీలు మున్సిపాలిటీల్లో కలిశాయి. దీంతో జిల్లాలో 25 ఎంపీటీసీలు తగ్గగా 257 స్థానాలున్నా యి. అలాగే, 21 జడ్పీటీసీలున్నాయి.
సత్తా చాటుతాం..
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటుతాం. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకతను మాకు అనుకూలంగా మార్చుకుంటాం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు