కడ్తాల్, జనవరి 25: ఇంటి నుంచి బయటకెళ్లిన యువతి అదృశ్యమైనది. ఈ ఘటన కడ్తాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శివప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన స్వర్ణకంటి భావమ్మ, నర్సింహ దంపతులకు కల్యాణి (19) అనే కుమార్తె ఉన్నది.
ఈ నెల 11 తేదీన ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకెళ్లి తిరిగి రా లేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె కోసం బంధువులు, తెలిసిన వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.