ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
- కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు
కేశంపేట, జనవరి 21 : ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధ్దిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. నిరుపేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు లక్ష్మయ్య, పర్వత్‌రెడ్డి, శ్రీనివాస్, యాదయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ
మండలంలోని ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఐకేపీ సీసీ, ఎంసీసీల ఆధ్వర్యంలో రూపొందించిన 2023 సంవత్సరం డైరీని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆవిష్కరించారు. ఐకేపీ సీసీ, ఏసీసీలు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఐకేపీ ఉద్యోగ సంఘాల నాయకులు గిరి, వెంకటయ్య, మల్లేశ్, రాజప్ప, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి వాలీబాల్టోర్నీ ప్రారంభం
నందిగామ : యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని మాజీద్మామిడిపల్లి గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, సర్పంచ్‌లు చంద్రారెడ్డి, గోవిందు అశోక్, జట్ట కుమార్, కో ఆప్షన్ సభ్యులు బేగ్, బీఆర్ఎస్ నాయకులు కట్న శ్రీశైలం, శ్రవన్, గోపాల్‌రెడ్డి, సుదర్శన్, శరత్కృష్ణ, శ్రీపాల్‌రెడ్డి, రామకృష్ణరెడ్డి, మురళి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- TRS government
- welfare
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

