కులకచర్ల, సెప్టెంబర్ 30 : చౌడాపూర్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్ చదివినవారు డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆర్ఎంపీలు క్లినిక్లను నిర్వహిస్తున్నారని ఇటీవల ఆ గ్రామస్తులు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు అనుమతి లేని డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్లను ఇటీవల అధికారులు సీజ్ చేశారు.
ఇంకేముంది.. కాగా, ఆర్ఎంపీలు రాజకీయ నాయకుల అండదండలతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అనుమతులు వచ్చాయంటూ మళ్లీ డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్లను తెరువడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్లు చేసే వైద్యాన్ని చేస్తున్నారని ఏ ప్రమాదం జరిగితే జిల్లా వైద్యాధికారులదే బాధ్యత అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఎవరి ఒత్తిడిలకు లొంగవద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రజలు కోరుతున్నారు.