తొర్రూరు, సెప్టెంబర్ 16: ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని, గ్రామాల్లోకి వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తండాబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన తొర్రూరు మండలంలోని గుడిబండతండా, భోజ్యాతండా, పెద్దమంగ్యాతండా, బీక్యాతండా, కొమ్మనపల్లితండా, సోమారపుకుంటతండాల్లో పర్యటించారు. ఆయా తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తండా ల్లో మ హిళలు సంప్రదాయ నృత్యం, బతుకమ్మలతో స్వాగతం పలికారు.
ఎడ్లబండిపై తండాల్లో ఊరేగించారు. బైక్ ర్యాలీ చేపట్టారు. ఆయా తండాల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని.., తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇవ్వని హామీలను తెలంగాణలో ఇస్తున్నదని, అకడ లేనిది ఇకడ ఇస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చేది లేదు.. వచ్చేదన్నారు. గిరిజనుల ఏండ్ల గోసను ఎడబాపడంతోపాటు రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గ్రామాలకు దీటుగా గిరిజన తండాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ కావాలో.. 3 పంటలకు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
కేసీఆర్‌కు మోసం చేస్తే సేవాలాల్‌కు మోసం చేసినట్లేనని గిరిజనులు గుర్తించాలన్నారు. గ్రామాలకు దీటుగా సుమారు కోటి రూపాయలతో ఒక్కో తండాను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతం లో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా? ప్రజలు ఆ లోచించాలన్నారు. ప్రజలను విభజించి పాలించే కుట్ర లు పన్నుతున్న కాంగ్రెస్ నేతలను నియోజకవర్గంలో కాలుపెట్టనివొద్దన్నారు. మన కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. .
మండలంలోని పెద్దమంగ్యాతండాకు చెందిన సోమ న్ని, వీరన్న, వెంకన్న, భోజ్యాతండా, చెందిన కాంగ్రెస్ నాయకులు, చీకటాయపాలెంకు చెందిన కాంగ్రెస్ గ్రా మ ఉపాధ్యక్షుడు ఆలకుంట్ల సైదులు, వడ్డెర సంఘం ముఖ్య నాయకులు ఆలకుంట్ల మధు, శివరాత్రి సందీప్, మైనార్టీ సంఘం ముఖ్యనాయకులు షేక్ పాషా, పెద్దవంగర మండలం బొత్తులతండా యూత్ అధ్యక్షుడు పీ మోహన్ ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.