ఆడబిడ్డలకు ఆరోగ్య మస్తు
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాగా, వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఆలస్యమైంది.
- జిల్లాలో ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం
- తొలుత మూడు పీహెచ్‌సీల్లో అమలుకు నిర్ణయం
- వికారాబాద్ జిల్లాలోని రామయ్యగూడ, యాలాల, దోమ పీహెచ్‌సీలు ఎంపిక
- త్వరలో అందుబాటులోకి రానున్న వైద్య సేవలు
- మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన వైద్యం
- మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతోనే అమల్లోకి ఆరోగ్య మహిళ పథకం
- షుగర్, బీపీ, థైరాయిడ్, సంతాన తదితర సమస్యలకు పరీక్షలు, చికిత్స
- ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు పరీక్షలు చేసేందుకు నిర్ణయం
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాగా, వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఆలస్యమైంది. తాజాగా ఈ పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో తొలి విడుతకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మొదట మూడు పీహెచ్‌సీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో రామయ్యగూడ, యాలాల, దోమ పీహెచ్‌సీలు ఎంపిక కాగా, వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు త్వరలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పీహెచ్సీలలో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫొలిక్యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బి12, విటమిన్-డి పరీక్షలు, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు చికిత్సను అందించనున్నారు. ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి, సేవలందించేలా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకోనున్నది.
వికారాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నది. తాజాగా రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఆరో గ్య మహిళా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మహి ళా ఆరోగ్యంగా ఉండేందుకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహిళా పథకం అమల్లోకి రాగా, త్వరలో మరిన్ని పీహెచ్‌సీల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అయితే ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తొలి విడుతలో జిల్లా ను ఎంపిక చేయలేదు. అయితే త్వరలో చేపట్టనున్న రెండో విడుత ఆరోగ్య మహిళా పథకాన్ని జిల్లాలో నిర్వ హించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో డీఎంహెచ్‌వో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా రు. మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలను గుర్తించి, వారికి సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారానికి ఒకరోజు ప్రత్యేకంగా మహిళలకు క్యాన్సర్ నిర్ధ్దారణ, డయాగ్నోస్టిక్ పరీక్షలతోపాటు 8 రకాల అనారోగ్య సమస్యలకు వైద్య సేవలందించనున్నారు.
మూడు పీహెచ్‌సీల్లో..
ఆరోగ్య మహిళా పథకం కింద జిల్లాలో మొదటి విడుతలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(రామయ్యగూడ, యాలాల, దోమ)లను అధికారులు ఎంపిక చేశారు. త్వరలోనే వీటిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రానున్నారు. ఇప్పటికే మూడు పీహెచ్‌సీల్లోని వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు డీఎంహెచ్‌వో డాక్టర్ పల్వన్‌కుమార్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే రామయ్యగూడ, యాలాల, దోమ పీహెచ్‌సీల పరిధిలోని మహిళలకు ప్రతి మంగళవారం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తదనంతరం జిల్లాలోని మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
ఎనిమిది రకాల వైద్య పరీక్షలు ఇవే..
- మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, సాధారణ పరీక్షలు
- ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్
- థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, పోలిక్ యాసిడ్, ఐరన్ లో పం, విటమిన్ బీ-12, విటమిన్ -డీ పరీక్షలు చేసి చికిత్సతోపాటు మందులు అందజేత
- మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల పరీక్షలు
- మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు.. అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్ ఇస్తారు.
- నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి వైద్యంతోపాటు అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
- సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహనతోపాటు వైద్యం చేస్తారు.
- బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారు.
జిల్లాలో మూడు పీహెచ్‌సీల ఎంపిక..
రాష్ట్రంలోని ప్రతి మహిళా సం పూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మహి ళా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం కింద జిల్లాలోని యాలాల, రామయ్యగూడ, దోమ పీహెచ్‌సీలను ఎంపిక చేశాం. త్వరలోనే ఈ మూడు పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహి ళా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. మహిళలకు సంబంధించి ప్రధానమైన 8 రకాల సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలందిస్తాం.
– డా.పల్వన్‌కుమార్, డీఎంహెచ్‌వో వికారాబాద్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

