శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 : తమ భూములు తమకు కేటాయించాలంటు భాగ్యనగర్ ఎన్జీవోలు చేస్తున్న అందోళన 156వ రోజుకు చేరుకుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ ఉద్యోగులు గోపన్‌పల్లిలోని బీటీఎన్జీవోస్ సోసైటీ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగించారు.
ప్లకార్డులు చేతపట్టుకొని తమకు న్యాయం చేయాలంటు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. బీటీఎన్జీవోస్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్లు రషీదాబేగం, కేశీయ నాయక్, దామోదర్, బెనర్జీలతో పాటు పలువురు ఉద్యోగులు, ఫెన్షనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.