షాద్‌నగర్, ఏప్రిల్27 : గుర్తు తెలియని రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి లింగారెడ్డిగూడ సమీపంలో రైలు పట్టాలపై మృతి చెందినట్లు గుర్తించామ తెలిపారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఇతర కాణాలు ఉన్నాయా ? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.