షాబాద్, ఫిబ్రవరి 10: కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లాలో80 బృం దాలతో శుక్రవారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. పేదలకు కంటిపరీక్షలు నిర్వహిస్తూ, ఉచితంగా అ ద్దాలు, మందులను పంపిణీ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 15,867మందికి..
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం 16 వ రోజుకు చేరింది. శుక్రవారం చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంప ల్లి నియోజకవర్గాల పరిధిలో 15,867 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించగా..అందులో 1,949 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 1,659 మందికి ప్రిస్కిప్ష న్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 5450 మందికి..
బొంరాస్‌పేట, ఫిబ్రవరి 10: రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జి ల్లాలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో వైద్యులు పరీక్షించి అవసరమైన వారికి మందులు, అద్దాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో కం టి వెలుగు కార్యక్రమం శుక్రవారానికి 16 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైద్యు లు 5,450 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,116 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేయగా, 731 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 80 గ్రామా లు, 22 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరం పరీక్షలు చేయించుకున్నాం.. అద్దాలు ఇచ్చారు..
మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం లో మేము ఇద్దరం కలిసి పరీక్షలు చేయించుకున్నాం. నన్ను నా భార్యనూ పరీక్షించిన వైద్యులు దృష్టి లోపం ఉందని చెప్పి కంటి అద్దాలు ఇచ్చారు. ఇదివరకు కంటి పరీక్షలు చేయించుకోవాలంటే పట్టణానికి వెళ్లాల్సి వచ్చే ది. ఇప్పుడు మా గ్రామంలోనే కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా రుణపడి ఉంటారు.
– మహ్మద్ ఇస్మాయిల్, ఇర్ఫానా బేగం, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల మండలం