కడ్తాల్, డిసెంబర్ 25: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బాలాజీనగర్‌లోని ధనరాశి రాధాకృష్ణ ఆలయం లో, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్‌స్వామి పర్యవేక్షణలో, ఆలయ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సుందరకాండ పారాయణం కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, హారతి, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మా ట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చు కోవాలని తెలిపారు. భక్తిభావం కలిగి ఉన్నప్పుడే ప్రశాంత జీవనం సాధ్యపడుతుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తభావాన్ని పెంపొందించుకొని, సన్మార్గంలో మార్గంలో నడవాలని పేర్కొన్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ బిచ్చానాయక్, ఏఎంసీ వైస్ చైర్మ న్ గిరియాదవ్, సర్పంచ్‌లు కమ్లీనాయక్, కృష్ణయ్యయాదవ్, హంశ్యామోత్యానాయక్, శంకర్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్‌నాయక్, సురేందర్‌రెడ్డి, హన్మానాయక్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.MLA Jaipal Yadav,