జిల్లాలోని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
55 పంచాయతీరాజ్ రోడ్లకు రూ.23.41 కోట్లు, 21 ఆర్అండ్బీ రోడ్లకు రూ.38 కోట్లు
త్వరలో పనుల ప్రారంభానికి అధికారుల చర్యలు
నెల రోజుల్లోపే పూర్తికానున్న టెండర్లు
మెరుగుపడనున్న రవాణా సౌకర్యం
పరిగి, ఫిబ్రవరి 7 : ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో జిల్లా పరిధిలోని రోడ్లకు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇందులో ఆర్అండ్బీ పరిధిలోని 21 రోడ్లు, 95 కిలోమీటర్లు బీటీ రెన్యువల్, మరమ్మతు పనుల కోసం ఇటీవల ప్రభుత్వం రూ.38 కోట్లు మంజూరు చేసింది. తాజాగా జనవరి 21న జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న 55 రోడ్ల మరమ్మతులకు రూ.23.41కోట్లు మంజూరు చేస్తూ సంబంధిత శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మరమ్మతులు, బీటీ రెన్యువల్ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఆయా రోడ్లవారీగా సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారుచేసి పంపించగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలోని అన్ని రోడ్లు మరింత మెరుగైన రవాణా సదుపాయం కల్పించే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. నిధుల మంజూరుతో నెల రోజులలోపే టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
55 రోడ్ల మరమ్మతులకు 23.41 కోట్లు
వికారాబాద్ జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పులుమామిడి వరకు 3.3 కిలోమీటర్ల బీటీ రెన్యువల్‌కు రూ.40 లక్షలు, పులుమామిడి నుంచి యెల్లకొండ వరకు 2 కి.మీ బీటీ రెన్యువల్‌కు రూ.40 లక్షలు, కొడంగల్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి అంగడిరాయచూర్ వరకు 6.5 కి.మీ బీటీ రెన్యువల్‌కు రూ.కోటి, దోమ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి దోర్నాల్‌పల్లి మీదుగా దొంగయెన్కెపల్లి వరకు 4కి.మీ బీటీ రెన్యువల్‌కు రూ.70లక్షలు, దోమ నుంచి పాలేపల్లి మీదుగా దిర్సంపల్లి వరకు 1.2 కి.మీ రూ.20 లక్షలు, కులకచర్ల మండ లం చౌడాపూర్ నుంచి జాకారం సరిహద్దు వరకు 3.2 కి.మీ రూ.80లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి తిర్మలాపూర్ మీదుగా అడవి వెంకటాపూర్ వరకు 1.5 కి.మీ రూ.22 లక్షలు, పరిగి మండలం కాళ్లాపూర్ నుంచి లొంక ఆంజనేయస్వామి దేవాలయం వరకు 1.8 కి.మీ రూ.27 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సయ్యద్‌పల్లి వరకు 1.6 కి.మీ రూ.30 లక్షలు, తొండపల్లి నుంచి యాబాజీగూడ వరకు 1.2 కి.మీ రూ.18 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బసిరెడ్డిపల్లి వరకు ఒక కి.మీ రూ.15 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సుల్తాన్‌నగర్ మీదుగా నారాయణపూర్ వరకు 1.5 కి.మీ రూ.22 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి లఖ్నాపూర్ వరకు 2 కి.మీ రూ.28 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మిట్టకోడూర్ మీదుగా రాజాపూర్ 0.5 కి.మీ రూ.8 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చిట్యాల్ 0.8 కి.మీ రూ.20లక్షలు, పేట మాదారం నుంచి పోల్కంపల్లి 0.5 కి.మీ రూ.15 లక్షలు, పూడూరు మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చన్గోముల్ మీదుగా రేగడిమామిడిపల్లి 2 కి.మీ రూ.73 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి యెన్కెపల్లి 1.8 కి.మీ రూ.27 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కడ్మూర్ మీదుగా జడ్పీ రోడ్డు 5 కి.మీ రూ.75 లక్షలు, బషీరాబాద్ మండలం మైల్వార్ నుంచి కంసాన్పల్లి 1.2 కి.మీ రూ.34.60 లక్షలు, అప్రోచ్ రోడ్డు నుంచి పార్వత్పల్లి ఒక కి.మీ రూ.20లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నవాల్గా-మైల్వార్ ఒక కి.మీ రూ.30 లక్షలు, ఖాసింపూర్ నుంచి బదలపూర్, గొట్టిగకలాన్ రూ.30 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కొర్విచేడ్ రూ.18 లక్షలు, మైల్వార్ నుంచి కంసాన్పల్లి రూ.30 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నవాల్గా-మైల్వార్ రూ.20 లక్షలు, అప్రోచ్ రోడ్డు నుంచి పార్వత్పల్లి రూ.22 లక్షలు, పెద్దేముల్ మండలం ఇందూర్ నుంచి గోపాల్పూర్ 1.8 కి.మీ రూ.41 లక్షలు, అడికిచర్ల నుంచి బాయిమీదితండా 2.85 కి.మీ రూ.51 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి జన్గాం రూ.14 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రుక్మాపూర్ రూ.37 లక్షలు, రుద్రారం నుంచి నాగులపల్లి జడ్పీ రోడ్డు రూ.34 లక్షలు, మంబాపూర్ నుంచి పెద్దేముల్ రూ.కోటి10లక్షలు, తాండూరు మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సిరిగిరిపేట్ 1.45 కి.మీ రూ.39.8 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వీరారెడ్డిపల్లి 2.2 కి.మీ రూ.54 లక్షలు, తాండూరు నుంచి ఎల్మకన్నె 4 కి.మీ రూ.86 లక్షలు, కాసింపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నారాయణపూర్ రూ.50 లక్షలు, జిన్గుర్తి రోడ్డు రూ.36 లక్షలు, దస్తగిరిపేట్ నుంచి అనంతారం రూ.20లక్షలు, యాలాల మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ప్యార్కంపల్లితండా 1.85 కి.మీ రూ.44.6 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పగడిపల్లి మీదుగా జుంటుపల్లి 4.45 కి.మీ రూ.కోటీ 14 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జుంటుపల్లి రూ.25 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ప్యార్కంపల్లితండా రూ.18 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి అచ్యుతాపూర్ రూ.18 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కిష్టాపూర్ వరకు రూ.18 లక్షలు, బంట్వారం మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మాలసోమారం ఒక కి.మీ రూ.25 లక్షలు, ధారూరు మండలం మోమిన్‌కుర్దు నుంచి పరిగి సరిహద్దు వరకు 3.50 కి.మీ రూ.91 లక్షలు, ధారూరు నుంచి కుక్కింద, కొండాపూర్ మీదుగా ధర్మాపూర్ 6 కి.మీ రూ.కోటీ32లక్షలు, కోట్‌పల్లి మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బీరోల్ 2.6 కి.మీ రూ.72 లక్షలు, మర్పల్లి మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కుడుగుంట మీదుగా రావులపల్లి 4.1 కి.మీ రూ.82 లక్షలు, మోమిన్‌పేట్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మాదిరెడ్డిపల్లి 1.8 కి.మీ రూ.36 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు బురుగుపల్లి స్టేజీ నుంచి సుద్దోడ్కతండా 1.8 కి.మీ రూ.41.3 లక్షలు, వికారాబాద్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు-పులుసుమామిడి మీదుగా జడ్పీ రోడ్డు 1.5 కి.మీ రూ.30 లక్షలు, ధన్నారం-కామారెడ్డిగూడ ఒక కి.మీ రూ.24 లక్షలు, బురాన్‌పల్లి-ధన్నారం 2.4 కి.మీ రూ.63 లక్షలు మంజూరయ్యాయి.