వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలకు నిరంతరం విద్యుత్తును సరఫరా చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ అప్రకటిత కోతలతో అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆ కోతల ప్రభా వం అన్నదాతలతోపాటు చిన్నతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. నాపరాతికి ప్రసిద్ధిగాంచిన తాండూరులోని వెయ్యికిపైగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో తయారయ్యే పలు ఉత్పత్తులకు కరెంట్ కోతలతో అంతరా యం ఏర్పడి.. వాటి యజమానులకు నష్టాలొస్తున్నాయి.
అంతేకాకుం డా ఆ యూనిట్లలో పనిచేసే దాదాపుగా 10,000 మందికి పైగా కార్మికుల ఉపాధికి గండి పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో తాము 16 నుంచి 18 గంటలపాటు పాలిషింగ్ యూనిట్లు, నాపరాళ్ల క్వారీల్లో పని చేని చేతినిండా డబ్బులు సంపాదించామని.. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలే పనిచేస్తుండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు.
తాండూరు, మార్చి 22 : కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో అటు చిన్న తరహా పరిశ్రమలు, ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య పరంగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా కొనసాగుతున్న తాండూరు సెగ్మెంట్లో కనీసం 2 వేలకు పైగా చిన్న తరహా పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ పరిశ్రమల్లో తయారయ్యే వివిధ ఉత్పత్తులకు కరెంటు కోతలతో అంతరా యం ఏర్పడడంతోపాటు యజమానులకు నష్టాలొస్తున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ విద్యుత్తు రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో.. వ్యవసా యం మొదలుకొని అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా కావడంతో వెలుగులు విరాజిల్లాయి. ఆసియా ఖండంలోనే నాపరాతికి ప్రసిద్ధిగాంచిన తాండూరు 24 గంటల విద్యుత్తుతో బాగా నడిచింది.. కాగా, నేడు కరెం ట్ కోతలతో ప్రతిరోజూ కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షలకు పైగా ఆదాయా న్ని పరిశ్రమల యజమానులు కోల్పోవాల్సి వస్తున్నది.
తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైన వెయ్యికి పైగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో పని చేస్తున్న 10 వేల మందికి పైగా కార్మికుల ఉపాధికి గండి పడుతున్నది. నాపరాళ్ల పాలిషింగ్ యూనిట్లలో చదరపు అడుగుల చొప్పున కమీషన్‌కు నాపరాళ్లను పాలి ష్ చేసే కార్మికులకు కరెంటు కోతలతో నష్టాలు దాపురిస్తున్నాయి. పాలిషింగ్ పరిశ్రమలతోపాటు నియోజకవర్గంలోని రైస్ మిల్లులు, దాల్‌మిల్లులు, సుద్ద పరిశ్రమలపైనా ఈ కోతల ప్రభావం పడుతున్నది. చిన్న పరిశ్రమల ఉత్పత్తులు స్తంభించి ప్రతిరోజూ కనీసం రూ.10 లక్ష ల వరకు ఆదాయం కోల్పోతున్నట్లు సమాచారం.
అన్నదాతకు అవస్థలు..
అప్రకటిత విద్యుత్తు కోతలు అన్నదాతకు శాపంగా మారుతున్నాయి. బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతన్నకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఒకవైపు భూగర్భజలాలు అడుగుంటుతుండడంతో నీళ్లు లేక కండ్ల ముందే ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
మరో వైపు రోజుకు 3-4 గంటలు మధ్యమధ్యలో కరెంట్ వస్తూపోతుండడంతో బోరుబావుల్లోని మోటర్లు పాడవుతున్నాయి. లోవోల్టేజీ కారణంగా ట్రాన్స్ఫార్మర్లూ కాలిపోతున్నాయి. ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటుతో అన్నదాతలు రాత్రి సమయాల్లోనూ పొలాల దగ్గరే ఉండాల్సిన దుస్థితి దాపరించింది. నియోజకవర్గంలోని పలు గ్రామా ల్లో వరి చేనుకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి.
కరెంట్ కోతలతో ఇబ్బందులు..
నా స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. బతుకుదెరువు కోసం తాండూరు కు వచ్చా. బీఆర్ఎస్ పాలనలో నాపరాళ్ల పరిశ్రమలకు 24 గంటలపాటు కరెంట్ సరఫరా కావడంతో 16 నుంచి 18 గం టలపాటు పాలిషింగ్ యూనిట్లు, నాపరాళ్ల క్వారీల్లో పని చేసి చేతినిండా డబ్బులు సంపాదించా. ఒక్కో పాలిషింగ్ యూనిట్ లో సగటున 4 యంత్రాలకు వెయ్యి నుంచి 12 వందల చదరపు అడుగుల నాపరా ళ్లు పాలిషింగ్ చేసి తనతోపాటు చాలామంది దినసరి కూలీగా అధిక మొత్తంలో తీసుకున్నాం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ప్రారంభం కావడంతో చాలా ఇబ్బందిగా మారింది. ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలే పనిచేస్తుండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కరెంటు కోతల్లేకుంటే ప్రతిరోజూ 16 నుంచి 18 గంట లు పనిచేసి రూ.800 నుంచి రూ.1200 సంపాదించేది.
-అక్షయ్, కార్మికుడు
బీఆర్ఎస్ హయాంలోనే ఫుల్ కరెంటు
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో కరెంట్ ఫుల్లుగా ఉన్నది. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కంటే ముందు కరెంట్ కోసం ఎంత తిప్పలైందో ఇప్పుడు మళ్లీ అదే బాధ. రాత్రిళ్లు మోటర్ల వద్దే నిద్రించాల్సిన రోజులొచ్చాయి. ప్రస్తుతం రోజుకు 3-4 గంటల పాటు కరెంటు పోతుండడంతో ఇబ్బందులు తప్పడంలేదు. పంట పొలాలకు సరిగా నీళ్లు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో రాత్రివేళ్లలోనూ కరెంట్ కోతలు ఉంటుండడంతో అంద రూ ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ పాలన వస్తేనే రైతులకు బాగుంటుంది. పండుగల వ్యవసాయం చేసుకుంటాం. సంతోషంగా జీవిస్తాం.
-నర్సప్ప, రైతు, జుంటుపల్లి