రంగారెడ్డి : మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలిసి పోతున్నాయి. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలను తల్లిదండ్రులు నిర్దయగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా అప్పుడే పుట్టిన నెలలు నిండని పసికందును( Newborn baby) రోడ్డు పక్కన చెత్త చెత్తకుప్ప వద్ద పడవేవడంతో మృతి చెందింది.
ఈ అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లీ డివిజన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.