మంచాల, డిసెంబర్ 7 : కస్తూర్బాగాంధీ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం గురుకులాల బాటలో భాగంగా బీఆర్ఎస్ నాయకుల బృందం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది లోనికి రాకుండా గేటుకు తాళం వేసి అడ్డుకోవడంతో వారు అక్కడే నేలపై కూ ర్చుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వసతి గృహంలో సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష పార్టీని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నూతనగంటి శేఖర్, వనపర్తి బద్రినాథ్ గుప్తా, జానీపాషా, లాలాగారి జంగయ్య, మహేందర్యాదవ్, చింతకింది వీరేశం, పూన్నం రాము, ప్రశాంత్, రావుల ప్రవీణ్, శ్రీకాంత్, వినోద్, అశోక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.