షాబాద్, జూలై 13: తెలంగాణలో ఇస్తున్న ఉచిత కరెంట్‌పై లేనిపోని వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిని రైతులు తరిమికొట్టడం ఖాయమని షాబాద్, మొయినాబాద్ జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు షాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, ముంబయి-బెంగుళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అదే విధంగా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రహదారిపై నిరసన వ్యక్తం చేసి, దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్‌తో అన్నదాతలు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు గంటలు కరెంట్ ఎలా సరిపోతుందో చెప్పాలని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రైతుల పథకాలపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, బీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు గూడూర్ నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌యాదవ్, ఆరిఫ్, ఇమ్రాన్, రమేశ్‌యాదవ్, జయవంత్, ముఖ్రం, దర్శన్, అంజయ్య, ఇబ్రహీం, నర్సింహాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశ్, రాజేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, మాణిక్యరెడ్డి, సత్యం, బల్వంత్‌రెడ్డి, కృష్ణ, సుధాకర్‌గౌడ్,
మాడ్గుల : బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మాడ్గుల, ఇర్విన్, ఆర్కపల్లి, నాగిళ్ల గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ తిరుమల్‌రెడ్డి, సర్పంచ్ వసురాం, ఉప సర్పంచ్ రాములు, విష్ణునేత, మహేశ్, చెన్నయ్య, శ్రీను, తిరుపతి, శివలింగం, రవి, వెంకటయ్య, యాదయ్య, విజయ్ నాయక్ పాల్గొన్నారు.