Get together | కేశంపేట, జూన్ 15 : కేశంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005 – 2006లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బీఎస్‌వై గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో తమ పూర్వ గురువులు సునీత, అమావతి, ఆరీపుద్దీన్, దివాకర్‌యాదవ్, ప్రభాకర్, నీలవర్ధన్, అర్జునప్పలను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. తమకు విద్యాబుద్దులు నేర్పి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కారణమైన ఉపాధ్యాయులను ఎప్పట్టికీ మరిచిపోలేమన్నారు. 20 ఏళ్ల తర్వాత అందరం కలుసుకోవడం ఆనందంగా ఉందని, జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా తమ చిన్ననాటి స్నేహితులను మదిలో పదిలంగా గుర్తుంచుకుంటామన్నారు. 70 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఒకేచోట చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రేమ్‌కుమార్‌గౌడ్, దశరథం, లింగం, కృష్ణ, రమేశ్, రాజేందర్, పుష్పలత, కృష్ణవేణి, జ్యోతి, కవిత, షుష్మ, మల్లేశ్‌యాదవ్, గణేశ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.