కోట్‌పల్లి, నవంబర్ 29: తెలంగాణ సర్కారు మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను అం దించి, వారి ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందిస్తూ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నదని సర్పంచ్ నక్కల విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ అన్నారు.
మంగళవారం కోట్‌పల్లి చెరువులో వారు జిల్లా డీఎఫ్‌వో చరిత, ఎస్డీవో సౌజన్యలతో కలిసి చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రియాజొద్దిన్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి సుశీల్‌కుమార్, యువజన నాయకులు దినేశ్‌కుమార్, బుగ్గాపూర్ పార్టీ ఇన్చార్జి నర్సింహులు, అనంత్‌రెడ్డి ఉన్నారు.