క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయి. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సకల వసతులు, నాణ్యమైన విద్యతో చదువుల ఒడిగా విరాజిల్లుతున్న ప్రభుత్వ బడులు.. ఇకపై క్రీడలకూ వేదికగా మార్చేందుకు ‘క్రీడా నిధి’ పేరుతో నిధులను మంజూరు చేసింది. గ్రామీణ విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,263 ప్రభుత్వ పాఠశాలలకుగాను రూ.84.95 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలలకు రూ. 10వేల చొప్పున కేటాయించింది. ఈ నిధులు నేరుగా పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమకాగా, క్రీడా పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
-షాబాద్, డిసెంబర్ 30
షాబాద్, డిసెంబర్ 30: విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఓ వైపు పేద విద్యార్థులకు నాణమైన విద్యను అందిస్తు న్న ప్రభుత్వం, మరోవైపు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నది. గ్రామీణ విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలోని 1,263 ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవలె రూ.84.95 లక్షల క్రీడా నిధులను విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ. 10వేల చొప్పున నిధులను కేటాయించింది. ఈ నిధులతో వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ బ్యాట్లు తదితర సామగ్రితోపాటు ప్రథమ చికిత్స కిట్లను కొనుగోలు చేయనున్నారు. తద్వారా విద్యార్థుల్లో మా నసిక ఎదుగుదలతోపాటు శారీరక దారుఢ్యం పెరుగనున్నది.
జిల్లాకు రూ.84.95 లక్షలు విడుదల
జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఉన్న 1,263 ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర ప్ర భుత్వం రూ.84.95 లక్షల క్రీడా నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతుల కల్పన పనులు చురుగ్గా సాగుతున్నాయి.
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడమే కా కుండా వారిని మానసికంగా, శారీరకంగా దృఢంగా తీర్చిదిద్దేందుకు ఆటలు ఎంతగానో దోహదపడుతాయని గుర్తించిన ప్రభుత్వం పాఠశాలలకు క్రీడా నిధి పేరుతో నిధులను విడుదల చేసింది. నేరుగా పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈ నిధులతో క్రీడా పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధుల రాక తో పాఠశాలల్లో క్రీడాసామగ్రి కొరత తీరనున్నది.
ప్రత్యేక నిధులు
జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఆటలను ప్రోత్సహించేందుకు క్రీడానిధి పేరుతో ప్రభుత్వం రూ.84.95 లక్షల నిధుల కేటాయించింది. అందులో 827 ప్రాథమిక పాఠశాలలకు రూ.41.35 లక్షలు, 180 ప్రాథమిక పాఠశాలలకు 18 లక్షలు, 256 ఉన్నత పాఠశాలలకు 25.60 లక్షలు వచ్చాయి. మొత్తం నిధుల్లో ఎస్సీ కాంపోనెంట్ కింద రూ. 20.38 లక్షలు, ఎస్టీ కాంపోనెంట్ కింద రూ.11.89 లక్షలు, జనరల్ కాంపోనెంట్కింద రూ.52.66లక్షలు నిధులను వినియోగించుకోనున్నారు. గత పదేండ్లుగా క్రీడా నిధు ల్లేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ బడులకు ప్రభు త్వం నిధులను మంజూరు చేసి చేయూతనందించింది.
ప్రాథమిక పాఠశాలకు రూ. ఐదు వేల చొప్పున
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.84.95 లక్షల క్రీడానిధులు మంజూరయ్యాయి. 1,263 బడుల్లోని పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతా ల్లో డబ్బులు జమయ్యాయి. ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున మంజూరైన నిధులతో విద్యార్థులకు క్రీడా సామగ్రిని కొనుగోలు చేయనున్నారు.
-సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో