వికారాబాద్, జనవరి 9 : పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ జిల్లా అధికారులు దాడులు చేశారని ఎస్పీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లాలోని నవాబుపేట, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పేకాట స్థావరాలపై అధికారులు దాడు లు నిర్వహించారన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు పేకాట స్థావరాలపై దాడులు చేసి, కేసు లు నమోదు చేసి 25 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రూ.3,81,830 నగదు, 27 సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నవాబుపేట పరిధిలోని గంగ్యాడ శివారులో ఉన్న మ ల్లేశం ఫామ్‌హౌస్‌లో పేకాట అడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకొని, వా రి నుంచి రూ.3,26,510 నగదు, 22సెల్ ఫోన్లు, 5 కార్లు, 6 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారన్నారు.
నవాబుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. బషీరాబాద్ పీఎస్ పరిధిలోని నవాల్గ గ్రామంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారని తెలిపా రు. పేకాట ఆడుతున్న ఐదు గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.55,320 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట ఆ డిన, ఇసుక, పీడీఎస్ రైస్‌ను అక్రమంగా ర వాణా చేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సెల్ 8712670022 నంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.