తాండూరు రూరల్ : లారీతో ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు మృతికి కారణమైన డ్రైవర్ అబ్దుల్ తాహేర్కు జరిమానా విధిస్తూ తాండూరు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వెలువరించింది. గురువారం కరణ్‌కోట ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జినుగుర్తి గోపాల్, శరణప్పలు 15.09.2015న తాండూరు నుంచి మల్కాపూర్ వైపు మోటర్ సైకిల్ (ఏపీ28డిఎ1275) పై వస్తుండగా గౌతాపూర్ స్పీడ్ బ్రేకర్ తర్వాత అబ్దుల్ తాహేర్ అనే డ్రైవర్ లారీ (ఏపీ 22డబ్ల్యు1038)ని అతివేగంగా నడుపుతూ మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టాడు. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
అప్పట్లో రూరల్ సీఐ సైదిరెడ్డి కేసు నమోదు చేసి ఛార్జీ సీట్ కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదానల అనంతరం న్యాయమూర్తి స్వప్న ముద్దాయి అయిన అబ్దుల్ తాహేర్కు రూ. 8వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని తెలిపారు.