శంషాబాద్ రూరల్, నవంబర్ 25: ఎవరూ నిరుద్యోగులుగా ఉండొద్దని, శిక్షణ తీసుకొని అవకాశం ఉన్న రంగాల్లో ఉపాధిని పొందాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. శంషాబాద్ మున్సిపాలిటీ, మండలంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా
నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించడంతో స్పందించిన సీఎం శంషాబాద్‌లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ట్లు వివరించారు. ఈ కేంద్రంలో 22 రకా ల శిక్షణలు ఇవ్వనున్నారని..మున్సిపాలిటీ, మండల పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ శంషాబాద్ చుట్టు పక్కల అనేక కం పెనీలు వెలుస్తుండటంతో ఇక్కడి ప్రజలు అన్ని రంగాల్లో రాణించేలా ముందుం డాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్‌యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు, వృత్తి నైపుణ్య కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.