శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 23: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. తెలంగాణ ఆర్థిక చోదక శక్తిగా ఎదిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఐప్లెడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్సీఏఈఆర్) అధ్యయనం ప్రకా రం.. రాష్ట్ర జీడీపీకి దాదాపు రూ.68, 000 కోట్ల జీవీఏతో దన్నుగా నిలిచింది. అంతేగాక ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3.5 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్టు తేలింది.
గత ఏడాది అక్టోబర్‌లో ఎన్సీఏఈఆర్ ఈ ఆర్థిక ప్రభావ మదింపును చేపట్టింది. ఈ సందర్భంగానే తెలంగాణ జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్)లో ఆర్జీఐ ఎయిర్‌పోర్టు 4.6 శాతం వాటాను కలిగి ఉన్నట్టు అంచనా వేసింది. వాణి జ్య, సరుకు రవాణా, పెట్టుబడులపరంగా తెలంగాణకు ప్రధాన ఆస్తిగా నిలిచినట్టు అధ్యయనం తెలిపింది.