Suspicious Death | మేడ్చల్, ఫిబ్రవరి 15: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శామీర్పేట మండలం యాడారం గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాడారం గ్రామవాసి కుమార్ వీఆర్ఏగా కలెక్టరేట్లో పని చేస్తున్నాడు. కుమార్ భార్య లలిత (38) శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆమె మృతిపై అనుమానం తలెత్తడంతో గ్రామవాసి ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టు తెల్సింది. లలిత భర్త కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.