కొడంగల్, అక్టోబర్ 30: పూర్తి అవగాహన ఉన్నప్పుడే సర్వే పకడ్బందీగా చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని, ఎటువంటి సందేహాలు ఉన్నా అవగాహన కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండలం వారీగా, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ పరిధిలో సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వేపై ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు నివాస గృహాల జాబితా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇం టింటి సర్వే పూర్తి చేయాల్సి ఉందన్నారు. మరో 9 రోజుల పాటు చేపట్టిన సర్వేను డేటా ఎంట్రీ కార్యక్ర మాన్ని చేపట్టాల్సి ఉంటుందని, మొత్తంగా వచ్చే నెల 26వ తేదీ వరకు సర్వే పూర్తి కావాలని తెలిపారు. సర్వే ఫాంలో మొత్తం 56 అంశాలు పొందుపరచాల్సి ఉంటుందని, ఎటువంటి తప్పులకు తావు లేకుండా సర్వే చేపట్టాల్సిన బాధ్యత ఎన్యూమరేటర్లతో పాటు సూపర్వైజర్లకు ఉంటుందని సూచించారు. పంచాయతీ సెక్రెటరీలు,అంగన్వాడీ టీచర్లు, వీవోఏ బుక్‌కీపర్లు, ఆశా కార్యకర్తలను ఎన్యూమరేటర్లుగా, అగ్రికల్చర్ ఏఈవోలు, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు సూపర్వైజర్లుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లను పర్యవేక్షించడంతో పాటు ఇంటింటి సర్వేను పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్ఞానేశ్వర్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో ఉషశ్రీ, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు పేదలకు అందే దిశగా సర్వే
వికారాబాద్: ప్రభుత్వ పథకాలు పేదలకు అందే దిశగా సర్వే నిర్వహించను న్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్ తెలిపారు. బుధవారం సర్వేపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్లు, రిసోర్స్ పర్సన్, అంగన్వాడీ టీచర్లకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ హాజరయ్యారు. ఎన్యూమరేటర్లకు సర్వే లో చేపట్టాల్సిన విధి విధానాలపై మార్గదర్శకాలను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రజల జీవి తాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రొఫార్మాను క్షుణ్ణంగా చదివి ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను పొందుపరచాలని ఆయన సూచిం చారు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని ఇచ్చిన ఫారాల్లో సమా చారాన్ని క్రోడీకరించాలని ఆయన తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో సీపీవో అశోక్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మెప్మా పీడీ రవికుమార్ పాల్గొన్నారు.
తప్పులు దొర్లకుండా చూసుకోవాలి
తాండూరు రూరల్: క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన వారు సర్వేను సమర్థవంతం గా నిర్వహించాలని తాండూరు సబ్‌కల్టెర్ ఉమాశంకర్‌ప్రసాద్ అన్నారు. బుధ వారం ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక ఆర్థిక కులగణన శిక్షణ కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేటర్స్ శిక్షణలో పొందిన అంశాలను క్షుణంగా అధ్యయ నం చేసి, క్షేత్రస్థాయిలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటింటికీ తిరుగుతూ ఖచ్చితంగా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన సర్వే పై ప్రభావం ఉంటుందన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో నిబద్దతతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వప్రసాద్, పలువురు అధికారులు ఉన్నారు.
నవాబుపేట: సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేర కు నవాబుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అనురాధ ఆధ్వర్యంలో మండలాధికారులతో శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. మండల స్పెషలా ఫీసర్, డీఏవో హాజరయ్యారు. కుటుంబ సర్వేను తప్పులు లేకుండా సమగ్రంగా నిర్వహించాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీవో విజయ్‌కుమార్, ట్రైనర్స్, పాల్గొన్నారు.
మర్పల్లి: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్రమంగా నిర్వహించాలని మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎంపీడీవో రాజమల్లయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, టీఏలు, ఏఈవోలు, అంగన్వాడీ టిచర్లు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహిం చారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి తప్పులు దొర్లకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలన్నారు.. సర్వేకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యు లు లేకపోతే మరుసటి రోజు వెళ్లి సర్వే చేయించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుశీల్ కుమార్, ఏవో శ్రీకాంత్, ఏపీవో అంజిరెడ్డి, ఏపీఎం మధుకర్ తదితరులు పాల్గొన్నారు..
దౌల్తాబాద్: మండలంలోని అన్ని గ్రామాల్లో త్వరలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు.బుధవారం దౌల్తాబాద్ మండల జడ్పీ హైస్కూల్లో ఎన్యూమరెటర్లకు సమగ్ర కుటుంబ సర్వేపై శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమిస్తామని, ప్రతి 10 మంది ఎన్యూ మరేటర్లకు ఒక సూపర్వైజర్ నియమిస్తామన్నారు.
కులకచర్ల: నవంబర్ 6 నుంచి నిర్వహించే కులగణన సర్వేను విజయవంతం చేసేందుకు సిబ్బంది కృషిచేయాలని కులకచర్ల మండల ప్రత్యేక అధికారి వెంక టయ్య, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో కులకచర్ల, చౌడాపూర్ మండలాల ఎన్యూ మరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఎన్యూమరేటర్‌కు కుటుంబాలను కేటాయించడం జరుగుతుందని, దీని ప్రకారం 56 కాలంల ఫార్మాట్‌ను వారు చెప్పిన వివరాలను నమోదు చేయాలన్నారు. ఆర్థిక, కుల గణన, విద్య వంటి వాటిపై సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సర్వేను పకడ్బందీగా నిర్వ హించేందుకు సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్ మురళీధర్, వివిధ గ్రామాల ఎన్యూమరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.