తుర్కయాంజాల్, ఫిబ్రవరి 23 : అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కొహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ అన్నారు. ఆదివారం ఆయన గడ్డిఅన్నారం వ్యవసాయ మా ర్కెట్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన పండ్ల మార్కెట్ నిర్మాణానికి సిద్ధమైన డీపీఆర్‌తోపాటు లేఅవుట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, డైరెక్టర్లు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, ఇంజినీర్ లక్ష్మణుడు పాల్గొన్నారు.