నందిగామ : దేశ భద్రత విషయంలో భారత సైన్యం ( Indian Army) తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా ఉంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు( Minister Sridhar Babu ) అన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపై ( Terrorist Camps ) దాడులు చేసిన భారత సైన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన నందిగామ, చాకలిగుట్టతండా, సంఘీగూడ గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, మేకగూడ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో ( MLA, Shanker, ) కలిసి ప్రారంభించారు. చాకటిగుట్టతండాలో మాజీ సర్పంచ్ రాజునాయక్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన బస్టాండ్, చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. సామాజిక బాధ్యతతో నాట్కో ట్రస్టు గ్రామాలలో చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, నాట్కో ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.