చేవెళ్లటౌన్, జూలై 26: ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్ రహదారిపై ధర్నా చేశారు.
ఈ సందర్భంగా శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కళ్లెం సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని.. తమ హక్కు అని అన్నారు. అవి విడుదల చేయికపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెగా డీఎస్సీ వేయాలన్నారు.
ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్, నగర కార్యదర్శి మహిపాల్, ప్రదీప్, శివ, హరికృష్ణ, కిశోర్, నతీశ్, ప్రేమ్, రాఘవేందర్, అశ్విని, పూజిత, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. కాగా, శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లారు.దీంతో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
