వికారాబాద్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సమగ్ర పురోగతికి పునరంకితం అవుదామని పార్టీ శ్రేణులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
అమరవీరు ల ఆశయాల సాధనకు కట్టుబడి, ప్రజల సంక్షేమాని కి నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తప్పకుండా తెలంగాణ జాతిపితగానే మనం గౌరవించుకోవాలన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రభు త్వాలు ఉన్న ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా 24 గంటల ఉచి త విద్యుత్తును రాష్ట్రంలో అమలు చేసి అన్ని రంగా ల్లో తెలంగాణను ముందుంచిన కేసీఆర్‌ను వదులుకొని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అమలు చేసిన ఏ పథకాన్నీ అమలు చేయలేకపోతున్నదని.. మంచినీళ్లు, కరెంట్ ఇవ్వలేక పోతున్నదని ఎద్దేవా చేశారు. కేసీఆరే ఈ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సురేశ్, రాంరెడ్డి, అనంత్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, అశోక్, గయాజ్, మహిపాల్‌రెడ్డి, మల్లేశం, అశోక్, సత్యనారాయణ, అంజయ్య, రామస్వామి పాల్గొన్నారు.