కేశంపేట, జనవరి 30 : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో రూ. 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా కేశంపేటలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభు త్వం పనిచేస్తున్నదని, నిరుపేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయా వర్గాలకు లబ్ధ్ది చేకూరుతుందన్నా రు. గ్రామాల్లో ప్రజలకు సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం అధిక నిధులను ఖర్చు చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని హా మీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, నవీన్‌కుమార్, రాములునాయక్, కృష్ణయ్య, ఎంపీటీసీ యాదయ్యచారి, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, మాజీ ఎంపీపీ విశ్వనాథం, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు శ్రావణ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, పర్వత్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
కొత్తూరు రూరల్ : గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో ఆదివారం అంతర్గత మురుగుకాల్వ, సీసీ రోడ్డు పననులకకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను సాధించే దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుంచి రూ.5 లక్షలు, అంతర్గత మురుగుకాల్వ నిర్మాణానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.5 లక్షలను వెచ్చించినట్లు సర్పంచ్ తులసమ్మ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, గూడూరు, మక్తగూడ, మల్లాపూర్, మల్లాపూర్‌తండా సర్పంచ్‌లు సత్తయ్య, కాట్నరాజు, సాయిలు, రవినాయక్, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎం.కృష్ణయ్యయాదవ్, నాయకులు ఎం.దామోదర్‌రెడ్డి, జంగయ్యయాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు ఎం.పద్మారావు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.