షాద్‌నగర్‌టౌన్, మే 13 : రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. మున్సిపాలిటీలో 90శాతం ఆస్తి పన్నులు వసూలు చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన 2021-22పట్టణ ప్రగతి పురస్కారాల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు.
ఆస్తిపన్ను చెల్లింపులపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా 90శాతం ఆస్తి పన్నును వసూళ్లు చేశామన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డును అందుకోవడం పట్ల పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లకు సహకరించిన పట్టణవాసులకు, సిబ్బందికి మున్సిపల్‌కి చైర్మన్, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ అవార్డును అందుకోవడం పట్ల జాయింట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అభినందించినట్లు తెలిపారు.