డయేరియాను నివారిద్దాం
వేసవి, వానకాలాల్లో పిల్లలకు డయేరియా సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల ఆ వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు.
- రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు
- మే 25 నుంచి జూన్ 8వ తేదీ వరకు ‘డయేరియా నివారణ పక్షం’ నిర్వహణ
- బాధితులకు ఓఆర్‌ఎస్‌తోపాటు జింక్ మాత్రలను పంపిణీ చేయాలని సిబ్బందికి సూచన
రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): వేసవి, వానకాలాల్లో పిల్లలకు డయేరియా సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయని అందువల్ల ఆ వ్యాధి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన డయేరియా నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లాలోని పీహెచ్సీ వైద్యాధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఆరోగ్య సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి జూన్ 8వ తేదీ వరకు డయేరియా నివారణ పక్షంగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. డయేరియాకు చికిత్స ఓఆర్ఎస్ జింక్ మాత్రలేనని పేర్కొన్నారు.
ఇంటింటి సర్వే చేపట్టాలి..
పది రోజులపాటు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేసి ఐదేండ్ల లోపు పిల్లలున్న ప్రతి ఇంటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. ఎవరైనా డయేరియాతో బాధపడితే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు జింక్ మాత్రలూ అందజేయాలన్నారు. వ్యాధి తీవ్రంగా ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే వైద్యుడు చికిత్స అందిస్తారన్నారు. అనంతరం జిల్లా టీకాల అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో 1,36,000 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 75,000 జింక్ మాత్రలను అందుబాటులో ఉంచామని.. అవసరమైతే మరిన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

