మొయినాబాద్, ఏప్రిల్ 20 : చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన శ్రీవారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి ఆలయ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం వితరణ చేశామని, భక్తులకు స్వామి వారి దివ్య ఆశీస్సుల ప్రాప్తి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
వివాహం కానివారికి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని ప్రకటించడం జరిగింది. కానీ సంతాన ప్రాప్తి కోసం వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకునే అదే రీతిలో భక్తులు పాల్గొంటే చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. రేపు సాయంత్రం జరుగబోయే కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని, వివాహం కాని వారు ఇంటి వద్దనే ఉండి చిలుకూరు బాలాజీని స్మరించుకోవాలని సూచించారు.