Atmiya Bharosa | బషీరాబాద్, జనవరి 26 : అనర్హులకు ఆత్మీయ భరోసా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని.. మా గ్రామంలో బయటి లీడర్ల పెత్తనం ఏమిటని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తాండూరు ఎమ్మెల్యే మనో హర్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన కాశీంపూర్ గ్రామంలో ఆదివారం ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనికి వచ్చిన ఎమ్మెల్యేతో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి గుంట భూమి కూడా లేదని, అతడికి పక్షవాతం వచ్చి రెండేండ్లు అవుతున్నదని.. అతడి భార్య ఉపాధి హామీ పనికి వెళ్తున్నదన్నారు. వారి కుటుంబం ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక కాలేదన్నారు.
కొంతమంది అనర్హులకు ఆత్మీయ భరోసా జాబి తాలో పేర్లు వచ్చాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా శ్రీనివాస్ తిరిగి వెళ్లే క్రమంలో తాండూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వెనుక నుంచి ఓయ్ ఓయ్ అని కేకలు వేయడంతో శ్రీనివాస్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. సమస్యను ఎమ్మెల్యేకు వివరించగా.. ఆయన సాను కూలంగా స్పందించారు. మధ్యలో మీ పెత్తనం ఏమిటని సదరు నాయకు డిపై విరుచుకుపడ్డాడు. బయటి లీడర్లు మా గ్రామంలో పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే కార్యక్రమం నుంచి వెళ్లిపోగానే.. పేదలకు కా కుండా ఇష్టం వచ్చిన వారికి పథకాలను అందిస్తున్నారని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు.