క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి
క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు.
- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కడ్తాల్, ఫిబ్రవరి 5 : క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రేఖ్యాతండా గ్రామ పంచాయతీలో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించడానికి నియోజకవర్గానికి ఒక స్టేడియం, గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడలతో స్నేహబంధాలు పెంపొందడంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించడానికి ఇలాంటి టోర్నీలు ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కాసేపు క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, సులోచన, విజయలక్ష్మి, ఎంపీటీసీలు మంజుల, ప్రియ, నాయకులు సాయిలు, శంకర్‌నాయక్, జగన్, చంద్రమౌళి, రమేశ్‌నాయక్, సేవ్యానాయక్, వినోద్, పాండు, శంకర్, కోట్యా, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

