కడ్తాల్, మార్చి 8: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన కాశీవిశ్వనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండవ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ఆలయ ఆవరణలో హోమాలు, స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని భక్తులు దర్శించుకొని అభిషేకం, పూజలు చేశారు. శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలోని శివాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పూజలు చేశారు. ఏక్వాయిపల్లి గ్రామంలోని మల్లన్నగుట్టపై నిర్వహిస్తున్న మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు.
కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.. మహాశివరాత్రి సందర్భంగా మండల కేంద్రంతోపాటు మైసిగండి, ఏక్వాయిపల్లి గ్రామాల్లోని శివాలయాల్లో శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించే పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయా ఆలయ కమిటీల సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ట్రస్టీ శిరోలీపంతూనాయక్, తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, లచ్చిరాంనాయక్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీను, భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, వీరయ్య, నర్సింహ, భీక్యానాయక్, వెంకటేశ్, బీచ్చానాయక్, శ్రీనూనాయక్, ముత్యాలు, వెంకటయ్యయాదవ్, ఎట్టయ్యయాదవ్, భిక్షపతి, చంద్రయ్య, కుమార్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.