షాద్నగర్, మే20 : నిలిపి ఉన్న ఓ కారులో బ్యాటరీ పేలి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం షాద్నగర్ పట్టణ శివారులో ఉన్న ధన గ్యారేజ్ అనే కార్ల రిపేరింగ్ వర్క్ షాపులో ఉన్న ఇండికా కారులో బ్యాటరీ ఆకస్మాత్తుగా పేలి మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించే లోపే మంటలు వ్యాపించి గ్యారేజిలో ఉన్న మరో ఐదు వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
దీంతో షిఫ్ట్ డిజైర్ కారు పూర్తిగా కాలిపోవడంతో పాటు అల్టో కారు, ఓ గూడ్స్ వాహనం, ఇండికా కారు, రెండు హుందాయ్ ఎసెంట్ కార్లు మంటలో చిక్కుకొని దెబ్బతిన్నాయి. ఆగ్ని ప్రమాదంతో సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని గ్యారేజి యజమాని సుధాకర్ తెలిపారు. అగ్ని ప్రమాదన విషయాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలుపడంతో సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.