కొందుర్గు, డిసెంబర్ 04 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని చౌదరిగూడ ఎస్ఐ విజయ్‌కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాంగారెడ్డ జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని గుర్రంపల్లి గ్రామంలో గురువారం పోలీస్ కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొగద్దని, తమ ఓటు హక్కును నిర్భయంగా తాము అనుకున్న అభ్యర్థికి వేయాలన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చక్రీనాయక్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.