కందుకూరు, నవంబర్ 6 : మాదక ద్రవ్యలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మహేశ్వరం సిడిపిఓ శాంతి శ్రీ తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిని గూడూరు గేటు వద్ద గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముందుగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కన్న తల్లి తండ్రుల ఆశయాలను నేరవేర్చడానికి కష్టపడి చదుకోవాలని సూచించారు.
అనవసరంగా చెడు వ్యసానాలకు లోనై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. విద్యలో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. మత్తు పదార్ధాల వలన జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. సైబర్ నేరగాల్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కందుకూరు పోలీస్ స్టేసన్ ఎస్సై మహేందర్ సూచించారు. బాల్యవివాహలను అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకోసం బాల్య వివాహాలను చేసుకోవద్దని కోరారు. విద్యార్థులు మత్తు పదార్ధాలను అలవాటు చేసుకోవద్దని కోరారు. ఆపదలో ఉన్న సమయంలో 100 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాచూలూరు ప్రభుత్వ దవాఖాన డాక్టరు సంధ్య, అంగన్వాడీ సూపర్ వైజర్ ఇందిర, టీచర్లు యశోద, సుమతి, దీప, వైఎస్ ప్రిన్సిపాల్ శ్రీకిరణ్,కళాశాల, మెడికల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.