షాద్‌నగర్/షాద్‌నగర్‌రూరల్ : ఆధునిక సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు, యువతులు మహిళల హక్కులు, చట్టాలు అంశాలపైన పట్టుసాధించి అన్యాయాలను ఎదిరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వివాహాలు, విడాకులు, భార్య పోషణ, ఆస్తిలో మహిళల వాటా, మహిళల హక్కులు, కార్మిక చట్టాలు, వరకట్నం వేధింపులు, యాసిడ్ దాడులు, వేధింపులు, ఆశ్లీలత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సత్యనారాయణ, వేణుగోపాల్, మొహన్‌రావు, అంజయ్య, మహేందర్‌రెడ్డి, ఆంజనేయులు, రామస్వామి, సబియా సుల్తాన, జయమ్మ, శ్వేత, నరేంద్రనాథ్, శ్రీనివాసమూర్తి, ఎంపీటీసీ బీష్వ రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.