నందిగామ, జూన్1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంతో నిరుపేద కుటుంబాల సొంతింటి కళ సాకారం అవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని వెంకమ్మగూడ, చేగూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని విధాలుగా సర్వే చేసి గ్రామసభలు పెట్టి ఇందిరమ్మ కమిటీలు, అధికారుల పర్యవేక్షణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా జరిగిందని, అర్హులైన పేదలకు విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు. కాగా, చేగూరు గ్రామంలో చేగూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 11 టోర్నమెంటును ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.