షాబాద్ : జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 6వ తరగతిలో ప్రవేశానికి 17-04-2022 (ఆదివారం) రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
అదే విధంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్లకు 16-04-2022 (శనివారం) రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్-19 నిబంధనల మేరకు పరీక్షలు సురక్షితంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.