Indiramma Houses | వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం బంటువారం, కోటిపల్లి మండలాల ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో రాజకీయలకతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేయడం జరుగుతుందన్నారు. విడతలవారీగా ప్రతి ఒక్కరికి ఇందిర మహిళల అందజేయడంతో పాటు, కట్టించడం జరుగుతుందన్నారు. ఇల్లు నిర్మించుకున్న వారికి విడతలవారీగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు వెంటనే తమ ఇళ్లను నిర్మించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోచారం వెంకటేష్, నర్సింగ్ నాయకులు, ఎంపీడీవో రాములు, ఎంపీడీవో డేనియల్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇతర నాయకులు యాదగిరి, నర్సింలు, నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.