షాద్‌నగర్‌రూరల్, అక్టోబర్ 27: అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల, చిల్కమర్రి, చిన్న చిల్కమర్రి, విఠ్యాల, పుల్చర్లకుంట, కంసాన్పల్లి, గిరాయిగుట్ట, వెంకట్‌రెడ్డిపల్లి, బీమారం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు ప్రజలు, అభివృద్ధి గుర్తుకు వస్తాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం గ్రామాలు, తండాలు, పట్టణాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. 500మంది జనాభా దాటిన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి తండాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతి, హరితహారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సర్కార్ ప్రత్యేక నిధులను అందించడంతో నేడు తండాలు, గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయన్నారు. అద్దంలా సీసీరోడ్లు, ఇంటింటికీ నల్లాలు, వీధి దీపాలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డు, చెత్త సేకరణ ట్రాక్టర్లు, హరితహారం మొక్కలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఫరూఖ్‌నగర్ మండలంలో చేస్తున్న ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తుంది. ఏ గ్రామం వెళ్లినా అంజయ్యయాదవ్ వెంట ప్రజలు నిలువగా, గ్రామాలు గులాబీమయంగా మారుతున్నాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఒగ్గు కిషోర్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, బెంది శ్రీనివాస్‌రెడ్డి, రాయికల్ వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కట్ట వెంకటేష్‌గౌడ్, లింగంయాదవ్, చంద్రశేఖర్, వహబ్, లింగం, శేఖర్, జూపల్లి శంకర్, రవీందర్‌రెడ్డి, సుస్మారెడ్డి పాల్గొన్నారు.