తలకొండపల్లి, డిసెంబర్ 12 : మనఊరు -మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యంతో భోజనం, ఉచిత యూనిఫాం, పుస్తకాలు డిజిటల్ విద్యతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభు త్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఎం సీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, ఎంఈవో సర్దార్‌నాయక్, ఉపసర్పంచ్ తిరుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, సత్తయ్య, మల్లేశ్, పాండు, సజ్జుపాష, భగవాన్‌రెడ్డి, మధు, లక్ష్మీకాంత్, శ్రీశైలంయాదవ్, యాదయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: నూతన మండలం కడ్తాల్‌లో అన్ని ప్రభుత్వ శాఖలకు కొత్త భవనాలను నిర్మిస్తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులను పోలీస్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వారికి అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీవో, సీహెచ్‌సీ, జూనియర్ కళాశాల, గ్రంథాలయం ఏర్పాటుకు త్వరలో నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాన్ని నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట ఏఎస్ఐ ప్రసాద్‌జీ, పీసీ మల్లయ్య ఉన్నారు.