వికారాబాద్/నవాబుపేట, అక్టోబర్ 7 : రైతుల భూములపైనే రేవంత్‌రెడ్డి డేగ కన్ను వేశారని.. రైతులకు న్యా యం జరిగేవరకూ బీఆర్ఎస్ పార్టీ ఎంతదూరమైనా వెళ్తుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన రైతుగోస కార్యక్రమానికి ఆమె హాజరై.. ఆయా మండలాల ట్రిపులార్ బాధిత రైతులు అధైర్యపడొద్దని .. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ..తల్లిదండ్రులపై ఎంత మమకారం ఉంటుందో.. రైతులకూ భూమిపై అంతే మమకారం ఉంటుందన్నారు. ట్రిపులార్ బాధిత రైతులు బాధపడుతున్నారని.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పాలని కేసీఆర్, కేటీఆర్‌లు మమ్మల్ని ఇక్కడికి పంపించారన్నారు. ఎవరి లబ్ధి కో సం ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను మార్చారో ప్రభుత్వం చెప్పాలన్నా రు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. రైతులకు నష్టం జరుగకుండా సర్కార్ ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట, పూడూరు మండలాల ట్రిపులార్ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని..ట్రిపులార్‌పై స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్, మంత్రు లు బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తూ రైతులను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్, మం త్రులకు తెలియకుండానే ట్రిపులార్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నా రా..? అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుపై ఎలాం టి సందేహాలున్నా హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చి అధికారు లు చెప్పాలన్నారు.. కానీ.. రైతులను అక్కడికి వెళ్లనివ్వకుండా పోలీసులు రైతులను దొంగలా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డా రు. సోమవారం ట్రిపులార్ బాధిత రైతులను పోలీసులు పట్టుకుంటే.. కాంగ్రెస్, బీజేపీల నాయకులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలుగకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
గతం లో మర్పల్లిలో వడగండ్ల వాన పడితే ఢిల్లీలో ఉన్న తనకు కేసీఆర్ ఫోన్ చేసి మర్పల్లి మండలంలో రైతులతో మాట్లాడి భరోసా కల్పించాలని చెప్పగా.. అప్పటికప్పుడే తాను విమానంలో ఢిల్లీ నుంచి వచ్చి.. అప్పటి మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి తెల్లవారు జామునే మర్పల్లికి వెళ్లి రైతులను పరామర్శించామని గుర్తు చేశా రు. రేవంత్ పాలన బాధ్యతను విస్మరిస్తున్నదని దుయ్యబట్టారు. ట్రిపులార్ బాధిత రైతులు జేఏసీగా ఏర్పడి లీగల్‌గా, ప్రణాళికపరంగా పోరాడాలని.. వారితో కలిసి వచ్చేందుకు తాము సిద్ధ మని సబితారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా స్వయంగా తనకు ఫోన్ చేయొచ్చని మొబైల్ నంబర్‌ను ఇచ్చారు.
పాత అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చారు.. కొత్త అలైన్మెంట్తో రైతులకు లాభం, నష్టం ఏంటో వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ తప్పుడు జీవోలిస్తూ …ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కాగా, ఆ వేదిక నుంచే సబితారెడ్డి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫోన్ చేసి ట్రిపులార్ బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కేశవపల్లి, చిట్టిగిద్ద గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలు, కల్వర్టులను పరిశీలించారు.
కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, రాష్ర్ట నాయకుడు ఆంజనేయులు, బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు భరత్‌రెడ్డి, విజయ్‌కుమా ర్, బందయ్యగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు శాంతికుమార్, పురు షోత్తంచారి, మండల ప్రచార కార్యదర్శి వెంకట్‌రెడ్డి, గౌస్, జగన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో కాంగ్రెస్ నాయకుల చేరిక అదేవిధంగా మాదారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ రాములు తన అనుచరులు 30 మందితో కలిసి నవాబుపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటానని.. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీలో చేరిన వారిలో యాదయ్య, శ్రీనివాస్, వెంకటయ్య, నర్సింహులు, ప్రవర్ధన్చారి, జోగయ్య, నర్సింహులు, విఠల్, ఆల్లూరి, నర్సింహులు, సుదర్శన్, ఎల్లయ్య, బాలయ్య, రాజు, లక్ష్యయ్య, శ్రీనివాస్ ఉన్నారు.
భూమినే నమ్ముకుని జీవిస్తున్న సన్న, చిన్న కారు రైతుల పొట్ట కొట్ట డం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. ట్రిపులార్ రైతుల పట్ల ఎమ్మె ల్యే, స్పీకర్, మంత్రులు స్పందించకపోవడం బాధాకరం. ట్రిపులార్ పనులు జరుగుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు..? ఈ విషయంపై ఎమ్మెల్యే, స్పీకర్ ఇండ్ల ఎదుట బాధిత రైతులు కూర్చొని ధర్నాలు చేయాలి. రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా పాలిస్తూ..రైతులను అరిగోస పెడుతున్నారు. తాము ట్రిపులార్‌కు వ్యతిరేకం కాదు. ట్రిపులార్ పాత అలైన్‌మెంట్‌ను మార్చి.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అలైన్మెంట్తో అర, ఎకరం, రెండెకరాల భూములున్నా సన్న, చిన్న కారు రైతుల పట్టాల భూములు పోతాయి. వారు రోడ్డునపడతారు. రైతులు అధైర్య పడొద్దు. కేసీఆర్ సైన్యం అండగా ఉంటుంది.
– మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ట్రిపులార్ అలైన్మెంట్లో పేదలు, సన్న, చిన్న కారు రైతుల భూములే పోతున్నాయి. భూములను నమ్ముకుని జీవిస్తున్న పేదల కడుపు కొట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం బడాబాబులు, ఆ పార్టీ నాయకులకు మేలు చేసేలా కొత్త అలైన్‌మెంట్‌ను మార్చింది. దానిని వెంటనే సవరించి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ పొందించిన పాత అలైన్మెంట్ ప్రకారమే రీజినల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలి.
-శుభప్రద్‌పటేల్ , రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు