ఆర్కేపురం, జూన్ 15 : నాదర్గుల్ డివిజన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో గల వెంకట్రాది నివాస్ ఫేస్-2 కాలనీవాసులు పన్నాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితాఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.