షాబాద్, ఫిబ్రవరి 8 : కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మొయినాబాద్ ము న్సిపాలిటీ పరిధిలోని పెద్ద మంగళారంలోని 16, 17, 18, 26, మొయినాబాద్‌లోని 15, 23, 24, 25, సురంగల్‌లోని 13, 14 ముర్తుజాగూడలోని 12వ వార్డు, చిలూకూరులోని 1, 19, 20, 21, 22 వార్డులు, హిమయత్‌నగర్‌లోని 2, 3, 4, 10 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
అనంతరం మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల పేరుతో అమలు కానీ హామీలు ఇచ్చి న కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పరిగిలో జరిగిన మీటింగ్‌లో మిషన్ భగీరథ పథకాన్ని నీరుగార్చేలా అక్కడి ఎమ్మెల్యే మాట్లాడార ని, రెండేండ్ల నుంచి నల్లా నీరు రావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆడబిడ్డలు తాగునీటి కోసం రోడ్లపైకి బిందెలు పట్టుకుని వెళ్లద్దొనే కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేసి మహిళల తాగునీటి ఇబ్బందులు తీర్చాలని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు కరెంట్‌తో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని.. కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతులకు 24 గంటల నిరం తర విద్యుత్తును అందించారని గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన కల్యాణలక్ష్మి డబ్బులు సరిపోవడం లేదని తాము అధికారంలోకి రాగానే తులం బంగారం ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ మాటే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారన్నా రు. ఆడబిడ్డల కోసం కేసీఆర్ బతుకమ్మ చీరలు అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పొదుపుసంఘాల మహిళలకే చీరలు పంపిణీ చేసిందని మండిపడ్డారు. రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఏడాదికి రెండు పంటలకు రైతుబంధు డబ్బులు ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వంలో రైతుభరోసా ఎప్పుడు వస్తదో తెలియని దుస్థితి నెలకొన్నదన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జీలు జయసింహ, అమృత్రావ్చౌహాన్, చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు, పార్టీ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, నరోత్తంరెడ్డి, మహి ళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్నాసతీశ్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.