రైతుబాంధువుడికి జేజేలు.. కొనసాగుతున్న పెట్టుబడి సాయం పంపిణీ
రైతుబంధు సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా.. అన్నదాతలు మురిసిపోతున్నారు. సంబురంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
- కొనసాగుతున్న పెట్టుబడి సాయం పంపిణీ
- సోమవారం ఆరెకరాలలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమైన నగదు
- రంగారెడ్డి జిల్లాలో 2,77,913 మంది అన్నదాతలకు రూ.204.66 కోట్లు అందజేత
- వికారాబాద్ జిల్లాలో 4177 మందికి రూ.9కోట్లు..
- సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు
రంగారెడ్డి, జూలై 3(నమస్తే తెలంగాణ) : రైతుబంధు సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా.. అన్నదాతలు మురిసిపోతున్నారు. సంబురంగా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తరతరాలుగా వస్తున్న పెట్టుబడి కష్టాలను తీర్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నదాతల కుటుంబాలు జేజేలు పలుకుతున్నాయి. కాగా, సోమవారం 6 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 2,77,913 మంది రైతుల ఖాతాల్లో రూ.204. 66కోట్లు జమకాగా, వికారాబాద్ జిల్లాలో 4177 మంది రైతుల ఖాతాల్లో రూ.9 కోట్లు జమయ్యాయి. సెల్ఫోన్లలో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ 2,24,137 మంది రైతులకు రూ.192.65 కోట్ల్లు అందాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

