ఇబ్రహీంపట్నం, మే 4 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్లు పెద్ద ఎత్తున గోతులు ఏర్పడిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్ల వెంట ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ నుంచి పోల్కంపల్లి, పోల్కంపల్లి నుంచి నెర్రపల్లి, నెర్రపల్లి నుంచి దండుమైలారం, చర్లపటేల్‌గూడ నుంచి తుర్కగూడ, కప్పాడు, తులేకలాన్తో పాటు మంచాల మండలంలోని మంచాల – జాపాల, ఆగాపల్లి – జాపాల్, మంచాల నుంచి చిత్తాపూర్, తాళ్లపల్లిగూడ, యాచారం మండల కేంద్రం నుంచి మల్కీజ్‌గూడ, మేడిపల్లి, నానక్నగర్తో పాటు మరిన్ని గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధాన రోడ్లు పెద్ద ఎత్తున గోతులు ఏర్పడటంతో పాటు రోడ్లప్రక్కన పెద్ద ఎత్తున గోతులు ఏర్పడటంతో రాత్రి సమయంలో ఈ రోడ్లవెంట ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలకు సంబంధించిన సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశారు. ఎన్నికల సమయంలో ఈ రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించినప్పటికి తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకపోవటంతో ఈ నిధులు వెనక్కి మల్లించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల రోడ్ల పనులు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణాలు కొనసాగించేందుకు కూడా వీలులేకుండా పోయాయని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువతో ప్రభుత్వం నుంచి ఎన్నికల సమయంలో రూ.17.06కోట్ల నిధులు విడుదల చేయించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఉన్న లింకురోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి టెండర్లు కూడా పూర్తిచేయించారు. కాని, తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఈ పనులు కొనసాగించెకపోవటంతో నిధులు వెనక్కి మల్లించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఖానాపూర్ గేటు నుంచి బైపాస్‌రోడ్డు నిర్మాణానికి రూ.3.50కోట్లు, బాటసింగారం పాత హైవే రోడ్డు నిర్మాణానికి రూ.3కోట్లు, మినీస్టేడియం నిర్మాణానికి రూ.2.50కోట్లు, మంతన్‌గౌరెల్లి నుంచి శ్రీమంతగూడ రోడ్డుకు రూ.2కోట్లు, కుత్బుల్లాపూర్ నుంచి గౌరెల్లి రోడ్డుకు రూ.1.30కోట్లు, మంచాల నుంచి జాపాల మీదుగా ఆగాపల్లి రోడ్డుకు రూ.4.30కోట్లు, కొర్రేముల్ నుంచి బాచారం రోడ్డుకు రూ.1.30కోట్లు, మాల్ నుంచి కిషన్‌పల్లి, కొత్తపల్లి రోడ్డుకు రూ.4కోట్లు, తులేకలాన్ నుంచి ధర్మన్నగూడ రోడ్డుకు రూ.80లక్షలు, నందివనపర్తి నుంచి చౌదర్పల్లి రోడ్డుకు రూ.76లక్షలు, ఎలిమినేడు నుంచి సాహెబ్‌గూడ రోడ్డుకు రూ.50లక్షలు, తాళ్లపల్లిగూడ నుంచి చిత్తాపూర్ మీదుగా మంచాల రోడ్డుకు రూ.1.50కోట్లు, ఎలిమినేడు నుంచి మాదాపూర్ రోడ్డుకు రూ.1కోటి, మంచాల నుంచి లింగంపల్లి రోడ్డుకు రూ.కోటి, కొమ్మోని బాయి రోడ్డుకు రూ.40లక్షలు, అయ్యవారి గూడ రోడ్డుకు రూ.40లక్షలు, నిధులను పంచాయతీరాజ్ మరియు ఎచ్ఎండీఏల ద్వారా మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండుసంవత్సరాలు కావస్తున్నప్పటికి తట్టెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేపట్టడంలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్యేకు మంత్రి పదవిపై ఉన్న ధ్యాస ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్లు గుంతల మయంగా మారటంతో ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. వెంటనే గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాలి.
గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అధ్వానంగా మారాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడిన ప్రయాణానికి పనికిరాకుండా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు సాగించేవారు ప్రమాదాల భారీన పడుతున్నారు. ఈ రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. వెంటనే గ్రామీణ రోడ్ల అభివృద్ధి చేపట్టాలి.