ఇబ్రహీంపట్నం, మార్చి 18 : ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.
మంచాల : మాజీ ఎంపీపీ గుండమోని జయమ్మ, మాజీ సర్పంచ్‌లు మల్లేశ్, శ్రీధర్ నాయక్‌లు మల్రెడ్డి రాంరెడ్డిని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మల్రెడ్డి రంగారెడ్డిని గండిచెరువు గ్రామ కాంగ్రెస్ నాయకులు కలిసి సన్మానించారు. కార్యక్రమంలో జక్క సంజీవరెడ్డి, సీహెచ్ భాస్కరాచారి, వంగేటి గోపాల్‌రెడ్డి, పూజారి కొండల్‌గౌడ్, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.